Sarath Babu Pratap Pothen’s last films releasing on the same day: ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటీనటులు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అలా కన్నుమూసిన ఇద్దరు సీనియర్ నటులు నటించిన చివరి సినిమాలు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండటం గమనార్హం. అందులో ఒకరు ఇటీవల కన్నుమూసిన శరత్ బాబు కాగా మరొకరు కొద్ది నెలల క్రితం కన్నుమూసిన రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి వీరిద్దరి జీవితాల మధ్య చాలా సార్లు కనిపిస్తోంది. అదేమిటంటే ప్రతాప్ పోతన్ ముందుగా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రాధిక వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత మరొకరిని వివాహం చేసుకోగా శరత్ బాబు కూడా అప్పట్లో స్టార్ నటిగా ఉన్న రామాపురం వివాహం చేసుకొని కొన్నాళ్లకు విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శరత్ బాబు ఒంటరిగానే తన సోదరి కుటుంబంతో కలిసి నివసిస్తూ వచ్చారు.


Also Read: Malli Pelli Movie Controversy: మళ్ళీ పెళ్లి మూవీ గురించి స్పందిస్తూ నరేష్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఇక ప్రతాప్ పొథెన్ నటించిన చివరి సినిమా ఈ శుక్రవారం నాడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతాప్ పోతన్ నటించిన చివరి తెలుగు సినిమాని రాజ్ మాదిరాజు గ్రే పేరుతో తెరకెక్కించారు. సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి పాత్రలో ఈ సినిమాలో ప్రతాపరెడ్డి కనిపించబోతున్నారు ఆయన అనూహ్య పరిస్థితుల్లో మరణించడంతో ఆయన మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. నరేష్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు.


నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఈ సినిమాని నరేష్ స్వయంగా నిర్మించగా స్టార్ నిర్మాత ఇప్పుడు డైరెక్టర్ గా మారిన ఎమ్మెస్ రాజు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో శరత్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆయన సూపర్ స్టార్ కృష్ణ పాత్రలలో నటించారా లేదా అది కేవలం ప్రచారమేనా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: Ashu Reddy Photos: దుబాయిలో మెడలో ఐడీ కార్డు వేసుకుని అషు రెడ్డి ఫోజులు.. ఏం చేస్తోంది చెప్మా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK